రెండోసారి కరోనా.. ఆ ఎనిమిది మంది పోలీసులకు మళ్లీ కోవిడ్...

సోమవారం, 7 డిశెంబరు 2020 (20:38 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న క్రమంలో​ హైదరాబాద్‌లో సెకండ్ వేవ్‌ కలకలం రేపుతోంది. ఇక తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందా.. అనే సందేహాలు తలెత్తున్నాయి. అయితే వారి సందేహం నిజమేనని ఆందోళన వ్యక్తం అవుతోంది. 
 
ఇవాళ ఎస్‌ఆర్‌‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఏకంగా ఎనిమిది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో నలుగురు సెక్టార్ ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే, ఈ ఎనిమిది మందికి కోవిడ్ సోకడం ఇది రెండో సారి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
గత జూన్ నెలలో తొలిసారి కరోనా బారినపడ్డ ఈ పోలీసులు.. మరలా ఇప్పుడు మరోసారి ఆ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఎస్‌ఆర్‌‌నగర్‌ పోలీసులు భయాందోళనలు నెలకొన్నాయి. చలి కాలంలో కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యాధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు. 
 
మరోవైపు, రెండోసారి కోవిడ్ సోకిన కేసులు కూడా హైదరాబాద్‌‌లో వెలుగు చూశాయి. ఎస్‌ఆర్‌నగర్‌‌లో ఏకంగా ఎనిమిది మందికి రెండోసారి కోవిడ్ సోకడం కలకలం సృష్టిస్తోంది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు