దేశంలో కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలైంది: ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా

శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:17 IST)
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ పెరిగిందని, కొన్నిచోట్ల సెకండ్‌ వేవ్‌ కూడా మొదలైపోయిందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వెల్లడించారు. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో తీసుకున్నంతగా ప్రజలు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ఢిల్లీలో కొంతమంది మాస్కులు లేకుండానే బయట సంచరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గులేరియా.
 
దేశంలో అనేక చోట్ల ప్రజలు గుంపులుగుంపులుగా ఒక్కచోట చేరుతున్నారని, కరోనా వ్యాప్తికి ముందున్న విధంగానే భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్ అవుతోందని.. ఇవన్నీ సెకండ్‌ వేవ్‌కు దారితీసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది.
 
ఇలాంటి పరిస్థితులలో, ఇప్పుడిప్పుడే వైరస్‌ కనుమరుగయ్యే అవకాశం కనిపించడం లేదని, భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగచూస్తాయని హెచ్చరించారు. దేశంలో ఒకానొక సమయంలో శిఖర స్థాయిని చేరిన తర్వాత కరోనా బాధితుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, ఇతర దేశాలతో పోలిస్తే మన జానాభా చాలా ఎక్కువ అని, అది కూడా కేసుల సంఖ్యపై ప్రభావం చూపుతుందన్నారు గులేరియా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు