అనిల్ కుంబ్లే : పది వికెట్లను ఖాతాలో వేసుకున్న అరుదైన క్షణాలు.. నేటికి 22 యేళ్లు

ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (14:31 IST)
భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. భారత క్రికెట్ జట్టుకు ఒంటి చెత్తో ఎన్నో చిరస్మరణీమైన విజయాలను అందించిన ఘన చరిత్రవుంది. అంతేనా... టెస్టుల్లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు(619) తీసిన మూడో బౌలర్‌‌గా గుర్తింపువుంది. 
 
అంతేకాకుండా, నేటి ఆధునిక క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి పది వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆ ఘనత సాధించి నేటికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి విశేషాలను గుర్తుచేస్తూ కుంబ్లే తీసిన పది వికెట్ల వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ఆ మ్యాచ్‌ విశేషాలేంటో ఓసారి చరిత్రపుటలను తిరగేస్తే...
 
1999లో పాకిస్థాన్‌ రెండు టెస్టుల పర్యటన కోసం భారత్‌కు వచ్చింది. అయితే, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 12 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సచిన్‌(136) విరోచితంగా పోరాడినా భారత్‌ ఓటమిపాలైంది. 
 
తొలుత పాక్‌ 238 పరుగులు చేయగా, భారత్‌ 254 పరుగులు చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు 286 పరుగులు చేసి భారత్ ముందు‌ 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 
 
ఈ క్రమంలోనే సచిన్‌ ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అతడు ఔటవ్వడంతో భారత్‌ స్వల్ప తేడాతో మ్యాచ్‌ ఓడిపోయింది. దీంతో తర్వాతి టెస్టులో టీమ్‌ఇండియా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
 
రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరిగింది. ఇందులో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 252 పరుగులు సాధించింది. ఆపై పాకిస్థాన్‌ను 172 పరుగులకే పరిమితం చేసింది. దీంతో టీమ్‌ఇండియాకు 80 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 
 
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేయడంతో పాక్‌ ముందు 419 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఆ జట్టు 207 పరుగులకు ఆలౌటైంది. అయితే, ఈ రెండో ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లు తీసింది అనిల్‌ కుంబ్లే ఒక్కడే. 
 
తొలి వికెట్‌ నుంచి చివరి వికెట్‌ వరకూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. అలా ఆధునిక క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 1956లో ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జిమ్‌ లేకర్‌ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశాడు. తర్వాత ఆ ఘనత సాధించింది కుంబ్లే మాత్రమే.

 

#OnThisDay in 1999, #TeamIndia spin legend @anilkumble1074 became the first Indian bowler and second overall to scalp all the 10 wickets in a Test innings.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు