న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. అలాగే, పాకిస్థాన్ జట్టు కూడా రికార్డు స్థాయి ఓటమిని మూటగట్టుకుంది. అయితే, కివీస్ జట్టు మాత్రం 144 యేళ్ల క్రికెట్ చరిత్రలో ఇంతకుముందెన్నడూలేని రికార్డును నమోదు చేసింది. ఆ రికార్డు వివరాలేంటో ఓసారి పరిశీలిద్ధాం.
పాకిస్థాన్ - న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా అబుదాబి వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ జట్టు చేతిలో 7 వికెట్లు ఉన్నప్పటికీ 46 పరుగులు చేయలేక చతికిలపడింది. అదేసమయంలో కేవలం 4 పరుగుల తేడాతో టెస్టు మ్యాచ్‌ను గెలుచుకున్న జట్టుగా కివీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ విజృంభణతో పాకిస్థాన్ జట్టు 171 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కివీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఒక దశలో పాకిస్థాన్ విజయాన్ని 46 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. దీంతో పాక్ జట్టు గెలుపు లాంఛనమేనని అందరూ భావించారు.
కానీ, ఆజాద్ పటేల్ ఒక్కసారి జూలు విదల్చడంతో పాక్ వికెట్లు టపటపా పడిపోయాయి. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. చివరకు పాకిస్థాన్ జట్టు 171 పరుగులకే ఆలౌట్ కావడంతో కివీస్ జట్టు 144 యేళ్ళ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డును ఆజాద్‌కు అందజేశారు.