టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి మండిపడ్డారు. ధోనీపై విమర్శలు గుప్పిస్తున్న వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడటాన్ని ఆపాలని రవిశాస్త్రి వార్నింగ్ ఇచ్చాడు. 36 ఏళ్ల వయస్సులో వున్నవారు ఎంతవరకు క్రికెట్ ఆడగలరు.. కేవలం రెండు పరుగులైనా వేగంగా పరిగెత్తగలరా అంటూ రవిశాస్త్రి అడిగాడు. అయితే 36 ఏళ్ల వయస్సున్న వ్యక్తులు రెండు రన్స్ చేసే లోపు, ధోనీ మూడు పరుగులు చేయగలడు.
ప్రస్తుత క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అత్యున్నత క్రికెటర్లలో ధోనీ ఒక్కడు. ధోనీలో ఉన్న గొప్ప లక్షణాలు మార్కెట్‌లో దొరికేవి కావని రవిశాస్త్రి అన్నాడు గత 30 ముంచి 40 ఏళ్ల పాటు క్రికెట్ చూస్తున్నానని.. కోహ్లీ కేవలం పదేళ్ల నుంచే క్రికెట్లో వున్నాడు. ధోనీ అలా కాదు.. 26 ఏళ్ల వయస్సున్న ఆటగాడిని కూడా చిత్తు చేయగలడని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. తాము పిచ్చోళ్లం కాదని.. ధోనీకి 36 ఏళ్లైనా.. అతనికంటే పదేళ్ల చిన్నవారైన ఆటగాళ్ల కంటే ఫిట్‌గా వున్నాడని ఆయన క్లారిటీ ఇచ్చాడు.