అహ్మదాబాద్ వన్డే మ్యాచ్ : ఇంగ్లండ్ ముంగిట భారీ విజయలక్ష్యం

ఠాగూర్

బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (18:07 IST)
స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, బుధవారం అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇందులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 357 పరుగుల భారీ స్కోరును చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ ముంగిట 357 పరుగులు కొండ విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 1, గిల్ 112, కోహ్లీ 52, కేఎల్ రాహుల్ 40, హార్దిక్ పాండ్యా 17, అక్షర్ పటేల్ 13, వాషింగ్టన్ సుందర్ 14, హర్షిత్ రాణా 13, అర్ష్‌ దీప్ సింగ్ 2, కుల్దీప్ యాదవ్ 1 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో అదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా, మార్క్ ఉడ్ 2, మహమూద్, అట్కిన్‌సన్, జో రూట్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
అహ్మదాబాద్ వన్డే.. సెంచరీ చేసిన గిల్.. అరుదైన రికార్డు సొంతం 
 
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మూడో వన్డే డే అండ్ నైట్ మ్యాచ్ బుధవారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించారు. కేవలం 50 ఇన్నింగ్స్‌లలోనే గిల్ ఈ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 
 
ఇలాంటి అరుదైన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకిసైతం సాధ్యంకాకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో గిల్ మొత్తం 102 బంతులు ఎదుర్కొన్న గిల్ మూడు ఫోర్లు, 14 ఫోర్ల సాయంతో 112 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 
 
ఇకపోతే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకోగా, ఈ మ్యాచ్‌లో మరోమారు విఫలమయ్యాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు