అహ్మదాబాద్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్: మూడు మార్పులతో టీమిండియా

ఠాగూర్

బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (14:32 IST)
వన్డే సిరీస్‌లో భాగంగా, స్వదేశంలో భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. అయితే, తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, షమీ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీవ్ సింగ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. అటు ఇంగ్లండ్ జట్టు కూడా ఓ మార్పు చేసింది. జేమీ ఒవర్టన్ స్థానంలో టామ్ బాంటన్‌ను తీసుకుంది. 
 
కాగా, ఇప్పటికే జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ విజయంసాధించిన విషయం తెల్సిందే. దీంతో నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో కూడా విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. కాగా, రెండో మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క రన్ చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం భారత స్కోరు వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. గిల్, కోహ్లీలు కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 
 
భారత జట్టు వివరాలు..రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, హార్దిక్, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, అర్ష్ దీప్ సింగ్
 
ఇంగ్లండ్ జట్టు : సాల్ట్, డకెట్, రూట్, బ్రూక్, బట్లర్, బాంటన్, లివింగ్‌స్టన్, అట్కిన్సన్, రషీద్, మార్క్ ఉండ్, మహమూద్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు