ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ బ్రేక్.. రూ.20.5కోట్లకు పలికిన కమిన్స్-ధోనీ ధరెంత?
మంగళవారం, 19 డిశెంబరు 2023 (18:42 IST)
ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా ప్రపంచకప్ విజేత కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల యువకుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రపంచకప్ విజేత కెప్టెన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేశారు.
రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి అడుగుపెట్టిన కమిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తీవ్రంగా పోటీ పడ్డాయి.గత్యంతరం లేని విధంగా రెండు ఫ్రాంచైజీలు పోటీ పడడంతో కమిన్స్ ధర అమాంతం పెరిగింది.
చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల భారీ ధరతో కొనుగోలు చేసింది. కాబట్టి గత సీజన్‌లో అత్యధిక ధర రూ. 18.50 కోట్లకు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ రికార్డును కమిన్స్ బద్దలు కొట్టాడు.
పంజాబ్ కింగ్స్ సామ్ కరన్‌ను రూ. 18.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధర. కాగా.. తాజా వేలంలో కమిన్స్ దానిని బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కమిన్స్ రూ. 15.5 కోట్లకు అమ్ముడు పోయాడు. అప్పుడు KKR టీమ్ అతనిని పొందింది.
ఐపీఎల్ 2022 సీజన్ వరకు ఆ జట్టు తరఫున ఆడిన అతను.. వన్డే ప్రపంచకప్, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం గత సీజన్‌లో ఐపీఎల్ ఆడలేదు. ఇప్పటివరకు 42 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కమిన్స్ 45 వికెట్లతో 379 పరుగులు చేశాడు.