భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు పోలీసులు చలాన్లు వేశారు. గంటకు 200 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకెళ్లడంతో పోలీసులు ఈ చలాన్లు విధించారు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పూణె వేదికకానుంది.
ఈ నేపథ్యంలో జట్టు సభ్యులతో కలిసేందుకు రోహిత్ శర్మ ముంబై నుంచి తన లాంబోర్హిని కారులో పూణే బయల్దేరాడు. అయితే హైవేపై రోహిత్ శర్మ గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లినట్టు స్పీడ్ గన్‌లు గుర్తించాయి. ఓ దశలో రోహిత్ శర్మ కారు గంటకు 215 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్టు 'పూణే మిర్రర్' మీడియా కథనం పేర్కొంది.
ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు రోహిత్ శర్మకు మూడు చలాన్లు వేశారని కూడా సదరు మీడియా సంస్థ వెల్లడించింది. రోహిత్ శర్మ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ విభాగం స్పందించింది. ఇలా హై స్పీడ్‌లో వెళ్లేకంటే, టీమ్ బస్‌లో పోలీస్ ఎస్కార్ట్‌తో వెళ్లి ఉంటే బాగుండేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.