ఈజీ మనీ పేరుతో అమ్మాయిల ట్రాప్.. ఆపై నగ్న వీడియోలు చిత్రీకరణ.. లైవ్ స్ట్రీమింగ్

ఠాగూర్

గురువారం, 17 ఏప్రియల్ 2025 (08:50 IST)
సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ మాయమాటలు చెప్పి అనేక మంది మహిళలను ఓ ముఠా ట్రాప్ చేస్తుంది. ఆ తర్వాత వారిని నగ్నంగా వీడియోలు చిత్రీకరించి, వాటిని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఎవరైనా అడ్డం తిరిగితే వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. ఈ బెంగుళూరు నగరంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలోని గంతకల్లు ప్రాంతానికి చెందిన లూయిస్ అనే వ్యక్తి స్థానికంగా కాల్ సెంటర్ నడుపుతున్నాడు. ఉద్యోగం పేరుతో యువతులు, మహిళను ట్రాప్ చేయసాగాడు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ మాయమాటలు చెప్పి తమ దారిలో పెట్టుకుంటాడు. పైగా, తాను చెప్పినట్టు వింటే భారీగా డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి నగ్నవీడియోలు చిత్రీకరించేవాడు. 
 
అలాగే, శ్రీకాకుళంకు చెందిన గణేష్, జ్యోత్స్న బంధువులమని చెప్పుకుని బెంగుళూరులో ఉంటూ అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువతులను, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి పరిచయం పెంచుకునేవారు. విలాసంగా జీవించాలంటే తాము చెప్పినట్టుగా చేయాలంటూ వారిని ఉచ్చులోకి లాగేవారు. మాట వినకుంటే ఫోటోలను మార్ఫింగ్ చేసి బంధువులు, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించేవారు.
 
ఇలా గుంతకల్లోలూ లూయిస్, బెంగుళురు గణేష్, జ్యోత్స్న అద్దె భవనాల్లో ఉంటూ తమ మాటలు నమ్మి తమ వద్దకు వచ్చే మహిళలు, అమ్మాయిల నగ్న వీడియోలు తీసేవారు. ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లించే వారికి నిషేధిత వెబ్ సైట్ల ద్వారా శృంగార దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. పోర్న్ వీడియోలను వెబ్‌సైట్లలో పెట్టడం, వాటి ద్వారా క్రిప్టో కరెన్సీ రూపంలో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. లూయిస్, గణేష్, జోత్స్న‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా బారినపడిన వారు ఎవరైనా ఉంటే సీఐడీ కార్యాలయంలోకానీ 1930 అనే ఫోన్ నంబరుకుగానీ ఫిర్యాదు చేయాలంటూ పోలీసులు కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు