అవినీతిపరురాలు శశికళ చేతిలో ఆరు కోట్ల తమిళ ప్రజల భవిష్యత్...

ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (13:37 IST)
ఆరు కోట్ల తమిళ ప్రజల భవితవ్యం అవినీతిపరురాలు శశికళ చేతిలోకి వెళ్లింది. శశికళ ఆడించినట్టు ఆడే రబ్బరు స్టాంపు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె.పళనిస్వామి ఆడనున్నారు. దీంతో కోట్లాది మంది తమిళ ప్రజల భవిష్యత్ ఎలా ఉండబోతున్నదే ప్రతి ఒక్కరి ముందున్న ప్రశ్న. 
 
ఎందుకంటే శశికళపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు. రూ.వేల కోట్ల బినామీ ఆస్తులు. పాతికేళ్ల క్రితమే సూట్‌కేస్ కంపెనీలు. ఇలా శశికళ అండ్ కో.. తమిళనాట చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినాసరే అధికారం మాటున, జయ ఇమేజ్ చాటున అన్నీ కనిపించకుండా పోయాయి. 
 
బలపరీక్షలో ముఖ్యమంత్రిగా పళనిస్వామి నెగ్గి ఉండవచ్చు. కానీ ప్రభుత్వాన్ని నడపబోయేది మాత్రం జైల్లో ఉన్న శశికళే అన్నది బహిరంగ రహస్యం. చిన్నమ్మ ఆదేశాల మేరకే ప్రభుత్వ నడుస్తుందని, సాక్షత్తూ సీఎం పళనిస్వామి ప్రకటించారు. 
 
అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు శిక్ష విధించిన ఓ అవినీతిపరురాలు చేతుల్లో ఆరుకోట్ల మంది తమిళ ప్రజల భవిష్యత్తు ఉండబోతోంది. పాతికేళ్లుగా పోయెస్ గార్డెన్‌కు పరిమితమైన అవనీతి ఊడలు ఇకపై ఎలా విస్తరిస్తాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దీనిపైనే రాజ్యాంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి