జనసేనపార్టీ అధినేతకు సొంత ఛానల్ ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. జనసేన పార్టీని స్థాపించడానికన్నా ముందే పవన్ ఒక ఛానల్‌లో షేర్ వేశారు. తన పేరు బయటరాకుండా ఉండాలన్న ముందుగానే మిగిలిన పార్టనర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాదు తనతోపాటు ఉన్న వ్యక్తిని ఛానల్ బాధ్యతలను చూడమని చెప్పాడు. అసలు పవన్ కళ్యాణ్‌కు ఛానల్‌లో షేర్ వెయ్యాల్సినంత అవసరం ఏముందంటారా...!
పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైపోయింది. కళ్యాణ్‌కు ముందు చూపు ఎక్కువే. ఏ విషయాన్నయినా లోతుగా చూసిన తర్వాత అడుగులు వేస్తాడు. ఒక్కసారి అడుగులు వేసిన తర్వాత వెనక్కి తిరగడం పవన్‌కు తెలియదు. అందుకే మాటతప్పని, మడమ తిప్పని నటుల్లో పవన్‌కళ్యాణ్ అగ్రగణ్యుడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తర్వాత అన్నింటికి పక్కా ప్రణాళికతోనే పవన్ ముందుకెళ్ళారు.
ఆ ఛానల్ నెంబర్ ఒన్ న్యూస్ ఛానల్. ఛానల్ ప్రారంభానికి ముందే లోగోపై స్టార్ గుర్తు బయటకు వచ్చింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తు. పవన్ ఛానల్‌లో ఉన్నాడన్న విషయం చెప్పకనే ఆ లోగో కాస్త చెప్పింది. ఇదంతా బాగానే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళన దిగడానికి సిద్ధమయ్యారు పవన్. ఈ నేపథ్యంలో తనకంటూ ఒక సొంత ఛానల్ ఉంటే ఎక్కువసేపు తన కార్యక్రమాలనే చూపిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో పవన్ ఉన్నారు. ప్రజల్లో చాలా త్వరగా వెళ్లేది ఒక టీవీఛానల్ మాత్రమే. అందుకే పవన్ ఆ దారి బాట పట్టాడు. తాను ఎలాంటి కార్యక్రమాలు చేసినా సామాజిక మాథ్యమాలు ప్రసారం చేస్తే జనం వద్దకు వెళుతుందనేది పవన్ ఆలోచన.
దీంతో ఈ ఒక్క ఛానల్ మాత్రమే కాకుండా మరికొన్ని ఛానల్‌లను కూడా కొన్ని రోజుల పాటు తన వైపు తిప్పుకోవాలన్న ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం తిరుపతిలో బహిరంగసభ తర్వాత తిరుగుపయనమైన పవన్ తన సన్నిహితులతో తిరుపతి విమానాశ్రయంలో ఛానల్ గురించి మాట్లాడారని తెలుస్తోంది. మొత్తం మీద ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ చేయనున్న ఆందోళనా కార్యక్రమాలకు కొన్ని ఛానళ్లు గంటల తరబడి చూపిస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.