జనసేన. ప్రస్తుతం రాజకీయాల్లో ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా అధికార, ప్రతిపక్ష నేతలకు మాత్రం ఈ పార్టీ పేరు వింటనే వెన్నులో వణుకు పుడుతోంది. కారణం.. ఆ పార్టీ చీఫ్ ఒక సినీ నటుడిది కావడమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో నిలబడకపోయినా తెలుగుదేశం పార్టీకి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఆ తరువాత టిడిపి అధికారంలోకి వచ్చింది.
కానీ యువత అంటే సాధారణ యువత కాదు. డబ్బులు బాగా ఉన్న యువత అనే ప్రచారం మొదలైంది. డబ్బులిస్తేనే పార్టీలో సీటంట. అది కూడా పార్టీకి కాదు. తనని తాను గెలుచుకోవడానికి డబ్బులు ఖర్చుపెట్టుకోవాలట. ఒక్కో అభ్యర్థికి ఇప్పటికే రేట్లు కూడా పవన్ చెప్పేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేకి ఒకరేటు, ఎంపికి ఒకరేటు. ప్రజలకు డబ్బులు పంచుతారో.. లేక ప్రచారానికి ఉపయోగించుకుంటారో మీ ఇష్టం.. అధికారంలోకి మాత్రం జనసేన రావాలన్నది పవన్ ఉద్దేశమట.
ఇప్పటికే ప్రజారాజ్యంలో టిక్కెట్ల పందేరం పెద్ద దుమారం రేగి చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసింది. మరి ఇప్పుడు పవన్ కూడా అదే ఎలా చేస్తారబ్బా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఇలాంటి వాటికి పవన్ ఎంతో దూరమనీ, కష్టపడి పైసా డబ్బు తీసుకోకుండా ప్రజలకు సేవ చేసే వారి కోసమే ఆయన ఎదురుచూస్తున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.