'అనంత'లో తిష్టవేసిన బాలయ్య... మీకోసం ఇక్కడే ఉంటా... నటసింహం
గురువారం, 8 మే 2014 (14:39 IST)
WD
హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన నందమూరి బాలకృష్ణ తన మకాంను హిందూపురంకు మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ హిందూపురం ప్రజలకు చేయాల్సిన సేవ కోసం తన సినిమాల సంఖ్యను కూడా తగ్గించుకుబోతున్నట్లు ప్రకటించారు.
సినిమాలు సంఖ్య తగ్గించుకున్నా మంచి కథ దొరికినప్పుడు వాటిలో నటిస్తుంటానని చెప్పారు. అనంతపురం జిల్లాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... హిందూపురంలో తన గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి సీమాంధ్రను సింగపూర్ లా అభివృద్ధి చేస్తారన్నారు.