కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారాలపట్టి ప్రియాంక గాంధీపై బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా మాటలదాడికి దిగారు. సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ లోక్ సభ స్థానంలో ప్రియాంక ప్రచారం చేస్తున్న నేపధ్యంలో నరేంద్ర మోడీ ఆమెపై అస్త్రాలు సంధించారు.
సోమవారంనాడు అమేథీలో పార్టీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... ఎవరికైనా అహంకారం పతాకస్థాయికి వెళితే ఎదుటివ్యక్తి గురించి ఏం మాట్లాడుతున్నారో మర్చిపోతారని ప్రియాంకను ఉద్దేశించి అన్నారు. స్మృతి ఇరానీ ఎవరంటూ ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరుగా మోడీ పైవిధంగా చురక అంటించారు.