వినుకొండలో వ్యక్తికి తుపాకి గురిపెట్టిన ఎస్సై... కడపలో ఖాకీలను తరిమిన వైనం

బుధవారం, 7 మే 2014 (15:41 IST)
WD
సీమాంధ్రలో 13 జిల్లాల్లో జరుగుతున్న పోలింగ్ అక్కడక్కడ శృతి తప్పింది. ఉద్రక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల వైఎస్సార్సీపి, తెదేపా కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకుని తలలు పగులకొట్టుకున్న సంఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా స్వర్ణలో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడంటూ అతడి కణతకు తుపాకి గురిపెట్టి భయోత్పాతం సృష్టించినట్లు ఓటర్లు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా చేతికి దొరికినవారిని దొరికినట్లు ఉతికేశాడని అంటున్నారు. ఆయనపై కేసు పెట్టనున్నట్లు తెలిపారు. మరోవైపు కడప జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జమ్మలమడుగులో గొడవపడుతున్న వ్యక్తులను అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగానే గ్రామస్థులంతా పోలీసుల వెంటపడ్డారు.

దాంతో బిత్తరపోయిన ఖాకీలు అక్కడ నుంచి పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం అదనపు బలగాలతో పరిస్థితిని చక్కదిద్దారు. మొత్తమ్మీద సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పోలింగ్ సరళి మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళుతోంది.

వెబ్దునియా పై చదవండి