నరేంద్ర మోడీ ఓ రాక్షసుడు : బేణీ ప్రసాద్ వర్మ ధ్వజం

శనివారం, 3 మే 2014 (18:23 IST)
File
FILE
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ మరోమారు ధ్వజమెత్తారు. మోడీ ఓ రాక్షసుడు అంటూ నోరుపారేసుకున్నారు.

ఎన్నికల సంఘం చీవాట్లు పెడుతున్నా ఆయన మోడీపై వాగ్భాణాలను మాత్రం ఆయన వీడటం లేదు. "మోడీ హిందూ ముస్లిముల మధ్య విబేధాలను, ద్వేషాన్ని రగిలించాడు. ఆయన ఓ మనిషి కాదు, రాక్షసుడు" అంటూ బేణీప్రసాద్ న్యూఢిల్లీలోని మస్కాన్వా టౌన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీపై నిప్పులు చెరిగారు.

నరేంద్ర మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలంటూ బేణీ ప్రసాద్ వర్మను రెండు రోజుల క్రితమే ఎన్నికల సంఘం గట్టిగా ఆదేశించిన విషయం తెల్సిందే. ఇది ఇలాగే కొనసాగితే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాల్సి వస్తుందని కూడా ఈసీ హెచ్చరించింది. అయినా, అమాత్యులకు ఇవేమీ పట్టినట్టు లేదు... బేణీ మాత్రం మోడీపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి