రాయ్‌ బరేలీలో నామినేషన్ దాఖలు చేసిన సోనియా!

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (14:49 IST)
File
FILE
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన తనయుడు రాహుల్ గాంధీతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సోనియాగాంధీ కాంగ్రెస్ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అట్టహాసంగా నామినేషన్ సమర్పించారు.

2004, 2009 ఎన్నికలలో రాయబరేలీ నుంచి ఎన్నికలలో పోటీ చేసిన సోనియా భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరోమారు విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్న సోనియాగాంధీ ఆశల మీద నీళ్ళు జల్లాలని బీజేపీతో పాటు ఇతర ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి