రాహుల్‌పై ప్రశంసలు: వరుణ్‌కు మేనక మొట్టికాయలు

గురువారం, 3 ఏప్రియల్ 2014 (14:04 IST)
File
FILE
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రశంసించిన తన కుమారుడు వరుణ్ గాంధీకి తల్లి, భారతీయ జనతా పార్టీ నేత మేనకా గాంధీ మొట్టికాయలు వేశారు. ఈ మేరకు జాతీయ మీడియాలో గురువారం వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ లోక్‌సభ సెగ్మెంట్‌లో అభివృద్ధి పనులు భేష్ అంటూ ప్రశంసలు గుప్పించిన బీజేపీ యువ నేత వరుణ్ గాంధీకి ఆయన తల్లి, బీజేపీ మహిళా నేత మేనకా గాంధీ కొన్ని హితోక్తులు చేశారు.

అమేథీలో జరిగిన, చేపట్టిన అభివృద్ధి పనులను స్వయంగా చూసిన తర్వాతే స్పందించాలని వరుణ్ గాంధీకి ఆమె సలహా ఇచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, తన సోదరుడైన రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీ అభివృద్ధిపై బుధవారం వరుణ్ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెల్సిందే.

దీనిపై మేనకా గాంధీ గురువారం పై విధంగాస్పందించారు. స్వయంగా చూడకుండా దేనిపైనా వ్యాఖ్యానించవద్దని హితవు పలికింది. అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమేనని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి