ఆ అమ్మాయిని పెళ్లి చేస్కుంటే రాహుల్ ప్రధాని కాలేడు... బాబా రాందేవ్

శనివారం, 26 ఏప్రియల్ 2014 (13:13 IST)
FILE
యోగా గురువు బాబా రాందేవ్ మాటలు ఎన్నికలు 2014 వేళ మరీ శృతిమించి పాకాన పడ్డాయి. శుక్రవారంనాడు లక్నోలో బాబా రాందేవ్ ఓ సభలో మాట్లాడుతూ, 'హనీమూన్, పిక్నిక్ కోసం దళితుల ఇళ్లకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెళుతూ ఉంటారు' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారతదేశానికి చెందిన యువతిని పెళ్లాడేందుకు రాహుల్ గాంధీ ఎంతమాత్రం ఇష్టం చూపడంలేదనీ, ఒకవేళ విదేశీ అమ్మాయిని చేసుకోదలిస్తే ఇపుడే చేసుకుంటే ప్రధాని అయ్యే ఛాన్స్ ఉండదు కనుక సోనియా వద్దని చెప్పి ఉంటుందని ఎద్దేవా చేశారు.

అందువల్ల ముందుగా ప్రధానమంత్రి పీఠం ఎక్కాక విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని సోనియా చెప్పడం వల్ల పెళ్లి చేసుకోవడం లేదని బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. రాందేవ్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు యోగా గురువు నోటికి తాళం వేయాలంటూ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. కాగా తను చేసిన వ్యాఖ్యలు దళితులను ఇబ్బంది పెట్టి ఉంటే వెనక్కి తీసుకుంటానని యోగా గురువు రాందేవ్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి