సంపదలో రూ.కోట్లకు పడగలెత్తిన హాట్‌గర్ల్ రాఖీ సావంత్!

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (18:38 IST)
File
FILE
బాలీవుడ్ హాట్ గర్ల్ రాఖీ సావంత్ ఆస్తుల విలువ రూ.14.69 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బుధవారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో పాల్గొన్నారు. ఈమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్రీయ ఆమ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ పార్టీని ఆమె సొంతగా స్థాపించారు. హాట్‌గర్ల్ అయిన తన ఎన్నికల గుర్తు కూడా హాట్ హాట్‌గా వుండాలన్న ఉద్దేశంతో తనకి పచ్చి మిరపకాయని గుర్తుగా కేటాయించాలని ఎలక్షన్ కమిషన్‌కి దరఖాస్తు పెట్టుకున్నారు.

ఇదిలావుండగా, రాఖీ సావంత్ ఆస్తి మొత్తం రూ.14 కోట్ల 69 లక్షలు. వీటిలో రూ.3 కోట్ల 57 లక్షలు చరాస్తులు, రూ.11 కోట్లు 12 లక్షలు స్థిరాస్తులు. ఆమె దగ్గర ప్రస్తుతం చేతిలో వున్న డబ్బు 96,427 రూపాయలు. 39 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో వున్నాయి. 61 లక్షలు బాండ్స్, షేర్స్ రూపంలో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఇవేకాకుండా, రూ.2 కోట్ల 12 లక్షలు ఇన్సూరెన్స్, పోస్టల్ సేవింగ్స్ వున్నట్టు చూపించారు. రూ.21 లక్షల విలువైన ఫోర్డ్ ఎండీవర్ కారు ఉన్నట్టు తెలిపింది. ముంబైలో ఒక ఫ్లాట్ వుంది. ఆస్తుల వివరాలు ఇలా ఉంటే, ఈ అమ్మడు మీద ఒక ఛీటింగ్ కేసు కూడా ఉన్నట్టు తెలిపింది. ఇంతకూ ఇన్ని కోట్లు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ చదువుకోలేదట.

వెబ్దునియా పై చదవండి