ఆలివ్ నూనెను కనురెప్పలకు రాసుకుంటే..?

శుక్రవారం, 28 డిశెంబరు 2018 (12:39 IST)
సాధారణంగా స్త్రీలకు కళ్లు చాలా అందంగా ఉంటాయి. కానీ, కొన్ని కారణాల వలన ఆ అందాన్ని కోల్పోతుంటారు. అంతేకాదు.. కనురెప్పలపై గల జుట్టు కూడా రాలిపోతుంది. ఈ సమస్యను తొలగించుకోవడానికి ఏవేవో మందులు, క్రీమ్స్ వాడుతుంటారు. అయినను ఎలాంటి ఫలితాలు కనిపించక ఆందోళన చెందుతారు.. ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే.. కనురెప్పలు అందంగా కనిపిస్తాయని చెప్తున్నారు బ్యూటీ నిపుణులు...
 
1. కనురెప్పలను తరచు ట్రిమ్ చేసుకుంటే అవి ప్రేరేపితమై కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.
 
2. కళ్లను మూసివేసి.. వేళ్లతో సున్నితంగా కంటిపై మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే కంటి రక్తప్రసరణ పెరిగి కనురెప్పలు పెరుగుతాయి. 
 
3. కంటి అలసట, ఒత్తిడి కారణంగా కూడా కనురెప్పలు రాలిపోతుంటాయి. అందువలన రాత్రి నిద్రపోయే ముందుగా ఆలివ్ నూనెను లేదా ఆముదంలో దూదిని ముంచి.. దాంతో కంటిపై మర్దన చేయాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా చేస్తే కళ్ల ఒత్తిడి తగ్గుతుంది. కనురెప్పలు పెరుగుతాయి.
 
4. నిమ్మ తొక్కను పారేస్తున్నారా.. వద్దు వద్దూ.. ఇలా చేయండి. తప్పక ఫలితం ఉంటుంది. కప్పు ఆలివ్ నూనెలో నిమ్మ తొక్కలను వారం పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత ఈ నూనెను కనురెప్పలకు రాసుకుంటే.. జుట్టు పెరుగుతుంది.
 
5. గ్రీన్ టీలో దూదిని ముంచి కనురెప్పల మీద పెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆపై శుభ్రం చేసుకుంటే.. కంటికి మంచి ఉపశమనం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు