డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము. చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం. ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం. భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం.
చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం. పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం. రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం. బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.