గ్రీన్ యాపిల్స్ తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్

శనివారం, 13 జులై 2024 (20:32 IST)
గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. గ్రీన్ యాపిల్ కొద్దిగా పుల్లని రుచిని కలిగి ఉంటుంది. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన పండు జీర్ణక్రియకు, చర్మానికి, గుండెకు మేలు చేస్తుంది.
ఈ పండ్లను యాంటీ ఏజింగ్ ఫుడ్ అని కూడా అంటారు.
ఇవి తింటుంటే చర్మంపై ముడతలు తొలగించడంలో సహాయపడుతాయి.
గ్రీన్ యాపిల్ తింటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది.
రోజూ గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.
విటమిన్ ఎ, సి, ఇనుము, కాల్షియం ఉన్న వీటిని తినడం వల్ల పోషకాలు అందుతాయి.
కేశాలు పెరుగుదలకు గ్రీన్ యాపిల్స్ మేలు చేస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు