పొట్ట తగ్గాలంటే.. కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోండి..

ఆదివారం, 13 ఆగస్టు 2017 (16:54 IST)
పొట్టతగ్గాలంటే.. తక్కువ తినడం కాదు.. ఆహారంలో పోషక పదార్థాలు చేర్చుకోవాలి. కీరదోసను అధికంగా తీసుకోవాలి. ఇందులో కెలొరీలు చాలా తక్కువ. పైగా తొంబైశాతం వరకూ నీరే ఉంటుంది. ఆకలీ వేయదు. అందుకే.. భోజనానికి ముందు ఒక కీరా తీసుకోగలిగితే అన్నం తక్కువ తినే ఆస్కారం ఉంటుంది. అలాగే బాదం పప్పులను తీసుకోవడం మరిచిపోకూడదు. 
 
బాదం పప్పులు మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయి. శరీరంలో నీరు కూడా పేరుకోకుండా ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే బాదంతోపాటు ఇతర నట్స్‌ తినాలి. ఆకలిగా అనిపించినప్పుడు సమోసాలు, బజ్జీలు తినే బదులు.. పండ్లు ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల చక్కెర్లు, కొవ్వు బాధ ఉండదు. పోషకాలు ఎక్కువగా అందుతాయి. బరువు తగ్గుతారు.
 
అలాగే సెనగలూ, బఠాణీలూ, పెసల మొలకల్లాంటివి పావు కప్పు తిన్నా.. పొట్టనిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఇదే బరువు తగ్గడానికి దారితీస్తుంది. పొట్టచుట్టూ కొవ్వు కరగాలంటే కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి. ఇందులో డీ విటమిన్లు, బీ12, ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి బరువును తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు