నేటి తరుణంలో ఎక్కడ చూసినా హైబీపీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఎలాంటి లాభాలు కనిపించవు. అంతేకాదు.. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. హైబీపీని తగ్గించాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే...
3. బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్స్, స్నాక్స్ వంటి పదార్థాలు తినడం మానేయాలి. ఈ పదార్థాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుకు వీలైనంత వరకు ఇంట్లో చేసిన సహజసిద్ధమైన పదార్థాలు తినాలి. అప్పుడే ఎలాంటి అనార్యోలు రావు.
4. ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలానే పండ్లు, కూరగాయలు, నట్స్, ఆరోగ్యవంతమైన నూనెలు, పప్పులు, తృణ ధాన్యాలు వంటల్లో ఉపయోగించాలి. ఇలా చేస్తే హైబీపీ తగ్గుముఖం పడుతుంది.