ఉల్లిపాయ పొట్టుతో ఎన్ని ప్రయోజనాలో...

బుధవారం, 25 జులై 2018 (09:53 IST)
ఉల్లిపాయలను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. పచ్చి ఉల్లిపాయలను మాంసాహారం, పప్పు వంటి వంటకాల్లో ఎక్కువగా తీసుకుంటారు. ఈ క్రమంలో ఉల్లిపాయలే కాదు వాటిపై ఉండే పొట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి ఈ పొట్టుతో ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.
 
ఈ ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటిని ఉపయోగించుకోవచ్చును. ఆ నీటిని నొప్పులు, వాపులు ఉన్నచోట రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఈ ఉల్లిపొట్టును వేసి కిటికీలు లేదా గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఇంట్లోకి దోమలు, ఈగలు రావు. ఈ పొట్టును సూప్‌లా తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుటకు ఉపయోగపడుతుంది. 
 
తద్వారా అధిక బరువు తగ్గడమే కాకుండా గుండె సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ ఉల్లిపొట్టు సూప్‌లో యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. క్యాన్సర్ వ్యాధులు దరిచేరవు. ఉల్లిపాయ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. తలస్నానం చేసేటప్పుడు జుట్టును ఈ ఉల్లిపాయ పొట్టు నీటితో మర్దన చేసుకుని ఆ తరువాత షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు