తమలపాకులను ముద్దగా నూరి తలకు పట్టిస్తే...

మంగళవారం, 13 నవంబరు 2018 (10:51 IST)
తాతయ్య అన్నం తిన్న తర్వాత అమ్మమ్మ ప్రేమగా చుట్టి ఇచ్చే తాంబూలంలో తమలపాకుదే అగ్రస్థానం. ఆలయాల్లోని అర్చకుల చేతిలో కూడా తమలపాకులదే పైచేయి. పెళ్లి, పేరంటం, పూజ, అర్చన, అభిషేకం, విందు, వినోదం అన్నింటా నేనున్నానంటూ పచ్చని ఆకులతో పదిమందినీ ఆకర్షించేది తమలపాకులు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో తమలపాకుని ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తారు. అలాంటి తమలపాకుల్లోదాగున్న వైద్యగుణాలను పరిశీలిస్తే...
 
* సంప్రదాయబద్దంగా వస్తున్న ఆచారం భోజనం తిన్న తర్వాత తాంబూల సేవనం. చేసిన భోజనం సులువుగా జీర్ణం కావడానికి తమలపాకు ఉపకరిస్తుంది.
* రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుంది.
* ఎముకలను దృఢంగా ఉంచే కాల్షియం, ఫోలిక్ యాసిడ్‌లతో పాటు.. విటమిన్ ఏ, సిలు ఈ ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి.
 
* ప్రతి రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడినీటితో తీసుకుంటే బాధిస్తున్న బోధకాలు వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
* క్రమం తప్పకుండా 2 నెలలపాటు 2 తమలపాకులు 5 మిరియం గింజలను కలిపి తిన్న తర్వాత గ్లాస్ నీళ్లు తాగుతుంటే పెరిగిన శరీర బరువు తగ్గి నడుము నాజూగ్గా మారుతుంది.
 
* * చెవుల మీద తమలపాకును గోరు వెచ్చ చేసి పెట్టుకుంటే తల నొప్పి తగ్గుతుంది.
* నెలల చిన్నారులకు ముక్కు కారుతుంటే తమలపాకును వేడిచేసి దానికి కొద్దిగా ఆముదం రాసి ఛాతి మీద ఉంచితే జలుబు తగ్గిపోయి శ్వాస ఆడుతుంది. ఒక్కసారే కాకుండా తగ్గేంత వరకు పెడుతుంటే చిన్నారులకు ఎంతో ఉపశమనం లభిస్తుంది.
* తమలపాకు తినడం వల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
 
* తమలపాకు రసానికి కొద్దిగా మిరియాల పొడి కలిపి 3 పూటల టీస్పూన్ చొప్పున తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
* తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తీవ్రత తగ్గుతుంది.
* తలలో చేరిన చుండ్రు ఓ సమస్యగా మారుతుంటే తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు తర్వాత తలస్నానం చేసినట్టయితే చుండ్రు సమస్యకు పరిష్కారమార్గం లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు