అంతర్యుద్ధం ఫలితం.. కొత్త దేశంగా దక్షిణ సూడాన్‌

అర్థశతాబ్దం పాటు సాగిన అంతర్యుద్ధం ఫలితంగా ప్రపంచ చిత్ర పటంలో కొత్తగా మరో దేశం ఆవిర్భవించింది. అదే దక్షిణ సూడాన్. ఈ దేశం శనివారం తొలి స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోనుంది. ఈ వేడుకలకు భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ముఖ్యం అతిధిగా హాజరుకానున్నారు.

సుమారు ఐదు దశాబ్దాల పాటు సాగిన అంతర్యుద్ధంలో 20 లక్షల మందికి పైగా ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఈ అణిచివేత ఎట్టకేలకు సద్దుమణిగి దక్షిణ సూడాన్ దేశం కొత్తగా ఆవిర్భవించింది. ఈ దేశ తొలి స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలు అనేకమంది ప్రపంచ నేతల సమక్షంలో శనివారం జరుగనున్నాయి.

ఉత్తర-దక్షిణ సూడాన్‌ మధ్య 2005లో జరిగిన శాంతి ఒప్పందం ద్వారా దక్షిణ సూడాన్‌ స్వాతంత్య్రాన్ని పొందగలిగింది. దేశం చీలిపోవడానికి సంబంధించి గత జనవరిలో ఓటింగ్‌ జరిగింది. దీనికి సంబంధించి ఐరాస ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ ఫలితంగా కొత్తగా దక్షిణ సూడాన్ ఏర్పాటైంది.

వెబ్దునియా పై చదవండి