ఇతరుల కంటే అంతర్గత ముప్పే ఎక్కువ: కియానీ

శనివారం, 4 జులై 2009 (18:00 IST)
పాకిస్థాన్‌కు ఇతర దేశాల నుంచి ఎదురయ్యే ముప్పు కంటే.. అంతర్గతంగా ఎదురయ్యే సమస్యలతోనే అధిక ప్రమాదం పొంచి ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అష్పాక్ కియానీ అభిప్రాయపడ్డారు. అందువల్ల దీన్నిపై తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు.

ఇతర దేశాల నుంచి (బాహ్య ముప్పు) ప్రమాదం లేదు. అయితే, అంతర్గత ముప్పు పొంచి వుందని, దీన్ని తక్షణం సరి చేయాలని ఆయన కోరారు. పాకిస్థాన్ నావల్ అకాడెమీలో జరిగిన 91వ ఆఫీసర్స్ కమీషనైజింగ్ పేరడ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోందన్నారు. దేశ సైన్యం మాత్రం ప్రతి ఒక్కదాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతోందన్నారు.

తాలిబాన్‌తో సహా ఇతర అతివాద సంస్థల నుంచి ఎదురయ్యే ముప్పును విజయవంతంగా తిప్పికొట్టిందన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజ సుస్థిరత, శాంతిని కాపాడేందుకు పాకిస్థాన్ కట్టుబడి ఉందన్నారు. పాక్ ఉపఖండంలో ఆయుధ పోటీని నివారించేందుకు కృషి చేస్తోందన్నారు.

వెబ్దునియా పై చదవండి