ఇరాక్ బాంబు పేలుళ్ళలో 50కు చేరిన మృతులు

గురువారం, 9 జులై 2009 (20:10 IST)
ఇరాక్ గురువారం బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. వరుసగా రెండుచోట్ల బాంబులు పేలడంతో పాటు.. మరో రెండు చోట్ల బాంబులు విసరడంతో మొత్తం 50 మంది మృత్యువాత పడ్డారు. ఇరాక్‌లో భద్రతలో నిమగ్నమైవున్న అమెరికా సంకీర్ణ సేనలు వారం రోజుల క్రితం వైదొలగిన తర్వాత ఇరాక్ బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లడం ఇదే తొలిసారి.

ఒక పోలీసు సర్జంట్‌తో పాటు.. అతని సోదరుని లక్ష్యంగా చేసుకున్న ఆత్మాహుతిదళ సభ్యుడు దాడికి పాల్పడినట్టు ఉత్తర పట్టణమైన తాల్ అఫర్ ప్రొవిన్షియల్ పోలీసు చీఫ్ జనరల్ ఖలేద్ హందానీ వెల్లడించారు. తొలుత దాడికి పాల్పడిన ఆత్మాహుతి సభ్యుడు పోలీసు యూనిఫాంను ధరించి, తనను తాను పేల్చుకున్నాడు.

ఈ పేలుడులో పోలీసు సర్జంట్‌తో పాటు.. అతని భార్య, పెద్ద సోదరుడు ప్రాణాలు కోల్పోగా, మరో సోదరుడు తీవ్రంగా గాయపడినట్టు ఆయన చెప్పారు. తొలి పేలుడు జరిగిన మరో నిమిషంలో మరో ఆత్మాహుతి సభ్యుడు పేల్చుకున్నాడు. మొదటి బాంబు పేలుళ్ళ బాధితులకు సహాయ చర్యలు చేపట్టేందుకు గుమికూడిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిపారు. దీంతో మృతుల సంఖ్య ఎక్కువైంది.

గత నెల 30వ తేదీన ఇరాక్ అర్బన్ సెంటర్ నుంచి అమెరికా బలగాలు ఇరాక్‌ను వీడి వెళ్లిన తర్వాత జరిగిన ఘోరమైన దాడి కావడం గమనార్హం. ఈ దాడిలో కనీసం 35 మంది మృతి చెందారని, మరో 61 మంది గాయపడినట్టు డాక్టర్ పథి యాసిన్ వెల్లడించారు. అలాగే, మరో రెండు బాంబు పేలుళ్ళ కేసుల్లో మరో 12 మంది మృత్యువాత పడ్డారు.

వెబ్దునియా పై చదవండి