గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గిద్దాం: అమెరికా

ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న గ్లోబల్‌ వార్మింగ్‌ను సమర్థవంతంగా తగ్గించాలని జీ-8 దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని అమెరికా చట్టసభ సభ్యులు స్వాగతించారు.

ఇటలీలో జరుగుతున్న జీ-8 సమావేశాల్లో రానున్న 2050వ సంవత్సరం నాటికి గ్రీన్‌హౌస్‌ వాయువులను 80శాతం తగ్గించాలని సభ్యదేశాలు ఒప్పందానికి వచ్చాయి.

గ్రీన్‌హౌస్‌ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వాతవరణ మార్పుల్లో సమతుల్యతను పాటిస్తామని చెప్పినట్టు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి