చైనాలో జాతి ఘర్షణలు: 150 మంది మృతి

చైనాలోని హింసాత్మక జిన్‌జియాంగ్ ప్రాంత రాజధానిలో మంగళవారం మరోసారి ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. భద్రతా దళాలను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ప్రధాన రోడ్డును మూసివేశారు. జిన్‌జియాంగ్ రాజధాని ఉరుంఖీలో గత రెండు రోజులగా జరుగుతున్న హింసాకాండలో 156 మంది మృతి చెందారు.

ఆందోళనకారులు మంగళవారం కూడా భద్రతా సిబ్బందితో ఘర్షణలకు దిగారు. అంతేకాకుండా ఆదివారం మొదలైన విధ్వంసక చర్యల్లో వేలాది వాహనాలు, షాపులపై ఆందోళనకారులు దాడి చేశారు. రోడ్డును దిగ్బంధించినందుకు పోలీసులు 200 మంది యెగుర్ వర్గానికి చెందిన పౌరులను అరెస్టు చేశారు. సంప్రదాయ ముస్లిం యెగుర్ వర్గానికి ఈ నగరంపై గట్టి పట్టుంది.

గత నెలలో ఓ బొమ్మల కర్మాగారంలో యెన్ చైనీస్, యెగుర్ వర్గాలకు చెందిన కార్మికుల మధ్య ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ ఘర్షణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ఉరుంఖీ నగరంలో యెగుర్ వర్గానికి చెందిన పౌరులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. ఈ హింసాకాండలో 800 మందికిపైగా పౌరులు గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి