తాజాగా చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్ల కారణంగా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా దేశంలోని జింజియాంగ్ ప్రాంతంలోనున్న వివిధ తెగల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.
ఈ ఘటనల్లో దాదాపు 156మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఇయాన్ కైలీ విలేకరులతో మాట్లాడుతూ...అక్కడ జరుగుతున్న దాడులపై తమ దేశం ఆందోళన చెందుతోందని ఆయన తెలిపారు.
తాము హింసను విడనాడండని అక్కడున్న అన్ని వర్గాల ప్రజలను కోరామని, హింసను విడనాడేందుకు చైనా ప్రభుత్వం విధించిన చట్టాలను గౌరవించాలని తాము కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుండగా అక్కడి ప్రజలు తమ దేశ చట్టాలను ఉల్లంఘించకుండా సముచిత గౌరవంతో ఆదరిస్తారని తాము భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.