పాప్ సంగీత సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్‌లాంటి తండ్రిని నేను ఇదివరలో, ఇకపైకూడా చూడబోనని జాక్సన్ సలహాదారుడు డాక్టర్. తోహమే అన్నారు.
జాక్సన్ మృతి తర్వాత అతనిని స్మరించుకుంటూ... ప్రపంచంలో అతనిలాంటి తండ్రి మరొకరు ఈ భూప్రపంచంలో ఉండరని నా ప్రగాఢ నమ్మకమని ఆయన తెలిపారు.
జాక్సన్ సోదరుడు జర్మైన్ ద్వారా ఓ గాయకునికి ఆర్థిక సహాయం అందించే విషయంగురించి జాక్సన్‌తో మాట్లాడేందుకు వెళ్ళినప్పుడు అతను పదిమందికి ఆర్థిక సహాయం అందించేవాడిలాగా కనపడ్డారని ఆయన అన్నారు. ఆయన ఓ ధర్మాత్ముడని జాక్సన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
అతను తన పిల్లలతో సరదాగా ఉంటాడని, అతనికి పిల్లలంటే ఎంతో ఇష్టమని, అతనిలాంటి తండ్రిని తాను ఇదివరకు ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. Michael Jackson, King of Pop, Nadya Suleman, child, grief, economic distress