ద.కొరియా, అమెరికాలో సైబర్ దాడులు !

దక్షిణ కొరియాలో మూడోసారి ప్రభుత్వ వెబ్ సైట్లపై సైబర్ దాడులు జరిగాయి. సైబర్ దాడులపని ఉత్తర కొరియాదై ఉంటుందని ఆ దేశం అనుమానాలు వ్యక్తం చేసింది.

అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... అమెరికాకు చెందిన ప్రభుత్వ వెబ్‌సైట్లు కాకుండా వైట్‌హౌస్ మరియు పెంటగాన్ కు చెందిన వెబ్ సైట్లపైకూడా ఇలాంటి సైబర్ దాడులు జరిగాయి. వీటినుంచి ఆయా వెబ్‌సైట్లను రక్షించి, సరిచేసిన నాలుగు రోజుల తర్వాత దక్షిణ కొరియాకు చెందిన వెబ్‌సైట్లపై సైబర్ దాడులు జరగడం గమనార్హం.

దక్షిణ కొరియాకు చెందిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారు చేసే కంపెనీ " ఏహన్‌ల్యాబ్ " ఇలాంటి వైరస్‌లపై అనుమానం వ్యక్తం చేసింది. గతంలో అమెరికా మరియు దక్షిణ కొరియా దేశాలలో కొన్ని డజన్ల కొద్ది వెబ్‌సైట్లపై సైబర్ దాడులు జరిగిన విషయం విదితమే.

గురువారం సాయంత్రం ఆరు గంటంలకు ఈ వైరస్‌లు తమ పనితనాన్ని చూపించాయని, అదే మరి కొన్ని వెబ్‌సైట్లలోనూ వీటి పనితనం చూపించాయని సంస్థ అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి