పాక్ నగరాల్లోకి పేలుడు పదార్థాల వాహనాలు

పాకిస్థాన్ ప్రధాన నగారాల్లోకి పేలుడు పదార్థాలు కలిగిన 25 వాహనాలు చొరబడినట్లు తెలుస్తోంది. ఈ వాహనాల్లో రవాణా అయిన పేలుడు పదార్థాల కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ పేలుడు పదార్థాలతో భారీ విధ్వంసక చర్యలకు కుట్ర జరిగినట్లు పాక్ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.

దీంతో నిఘా సంస్థలు దేశంలోని నాలుగు ప్రావీన్స్‌లను అప్రమత్తం చేశాయి. అన్నిరకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించాయి. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ కూడా పేలుడు పదార్థాల రవాణాకు సంబంధించి ప్రావీన్స్ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

పెషావర్, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, క్వెట్టా, కరాచీ నగరాల్లోకి పేలుడు పదార్థాలు రవాణా అయినట్లు, అంతేకాకుండా ఆయా నగరాల్లోకి ఆత్మాహుతి దళ సభ్యులు కూడా ప్రవేశించినట్లు పాక్ అధికారిక యంత్రాంగం అనుమానిస్తోందని ఆ దేశానికి చెందిన డైలీ టైమ్స్ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి