ఫిలిప్పీన్స్‌లో బాంబు పేలుళ్లు: ఆరుగురి మృతి

ఫిలిప్పీన్స్‌లో మంగళవారం సంభవించిన జంట బాంబు పేలుళ్లలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. అల్- ఖైదా తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న గ్రూపులు ఈ బాంబు దాడులు చేసి ఉంటాయని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జోలా ద్వీపంలో ఓ వ్యాపార ప్రదేశంలో తొలి బాంబు పేలుడు సంభవించింది.

ఇందులో ఆరుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే అనంతరం రెండు గంటలకు ఇలిగాన్ నగరంలో పార్కింగ్ ప్రదేశంలో నిలిపివున్న మిలిటరీ పెట్రోల్ జీపు పక్కన కారు బాంబు పేలుడు సంభవించింది. రెండో బాంబు పేలుడులో పది మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు బాలలు కూడా ఉన్నారని మిలిటరీ ప్రతినిధులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి