భద్రతా మండలిలో స్థానం కల్పించండి: భారత్

జీ-8 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటలీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి స్థానం కల్పించాలని జీ-8దేశాలకు విజ్ఞప్తి చేశారు.

అంతర్జాతీయ సమస్యల పరిస్కారంకోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో కీలక సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రపంచదేశాలను కోరారు.

అలాంటి సంస్థల్లో భారత్‌ సముచిత స్థానాన్ని కోరుకుంటుందని ఆయన తెలిపారు. ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.

భారత్ చేసిన విజ్ఞప్తిని బ్రిటన్ ప్రధాని గోర్డన్ బ్రౌన్ భద్రతామండలిలో భారత్‌కు స్థానం కల్పించాలన్న మన్మోహన్ సింగ్ డిమాండ్‌కు మద్దతు పలికారు.

ఈ సందర్భంగా బ్రౌన్ మాట్లాడుతూ... భారతదేశం 21వ శతాబ్దపు శక్తిగా ఎదుగుతోందని ఆయన కొనియాడారు. తమ ఇరుదేశాలు కలిసి అంతర్జాతీయ స్థాయిలో చర్చించి అభివృద్ధి దిశగా పయనించేందుకు అన్ని విధాల కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

దీంతోపాటు ప్రపంచంలోని పలు సమస్యలపైకూడా తాము దృష్టి సారించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి