భారతదేశంలో పర్యటించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఉత్సాహంగా ఉన్నారు. వచ్చే వారం ఆమె భారత్‌లో పర్యటించనున్నారు.
తన భర్త బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అమెరికా ప్రథమ మహిళగా తాను భారతదేశంలో పర్యటించానని, అప్పుడు ఉద్విగ్నతకు లోనయ్యానని ప్రస్తుతంకూడా తాను అదే ఉద్విగ్నతకు లోనవుతున్నానని ఆమె తెలిపారు. గతంలో తాను పొందిన ఆ ఆనందానికి అవధులు లేవని ఆమె పేర్కొన్నారు.
అమెరికా భారత్‌తో కలిసి వ్యాపార పరంగా భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఆమె పేర్కొన్నారు. తమ దేశ అధ్యక్షుడు ఒబామా భారత ప్రధానితో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతచూపిస్తున్నారని ఆమె తెలిపారు.