మా దేశంలోని అల్లర్లకు పాక్ కారణం: చైనా

తమదేశంలో తాజాగా జరుగుతున్న అల్లర్లకు కారణం పాకిస్థాన్ ప్రభుత్వమేనని చైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

అల్లర్లకు బాధ్యులైన తెగవారితో ఉన్న సంబంధాలపై పాకిస్థాన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చైనా గురువారం డిమాండ్ చేసింది.

ఇదిలావుండగా ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది పాకిస్థాన్ దేశమేనని ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా చైనా వాయువ్య రాష్ట్ర రాజధాని జింజియాంగ్‌లోనున్న తెగల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 156మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినాకూడా మృతుల సంఖ్య ఐదువందలకు పైగానే ఉంటుందని ప్రాథమిక సమాచారం.

వెబ్దునియా పై చదవండి