తన సంగీత గాన మాధుర్యంతో ప్రపంచాన్నే ఉర్రూతలూగించిన ప్రముఖ పాప్ సింగర్, దివంగత మైఖేల్ జాక్సన్ గతంలో తనను ప్రేమించాడని, తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడని కాని తాను అంగీకరించలేదని ప్రముఖ హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్ అన్నారు.
మైక్ మరణవార్త వినగానే దుఃఖాన్ని దిగమింగుతూ...మైక్ చెప్పిన మాటలను మననం చేసుకున్నానని, అతను నా నుండి చాలా దూరం వెళ్ళిపోతాడని తనకు అనిపించిందని ఆమె స్నేహితురాలికి చెప్పి గుర్తు చేసుకున్నట్లు జాక్సన్ శ్రద్ధాంజలి సభలో ఆమె తెలిపారు.
ఒకానొక సమయంలో మైక్ తనను వివాహమాడేందుకు సిద్ధపడ్డాడని కాని నేను అతనిని తిరస్కరించానని ఆమె రోలింగ్ స్టోన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
నిన్ను పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా బ్రతుకును ఇలా బ్రతకనివ్వు. నాకు ఇష్టమైనప్పుడు నేను పెళ్ళి చేసుకుంటాను. నాకంటు పిల్లలుంటారు. నువ్వుకూడా ఎల్లప్పుడూ నాతోనే ఉంటావని ఆమె ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇదిలావుండగా ఈ నటీ మణి గతంలో బ్లూలాగూన్ చిత్రంలో నటించింది. ఆమె వయసు ప్రస్తుతం నలభైనాలుగు సంవత్సరాలని ఆ పత్రిక పేర్కొంది.
ఆమె బ్లూ లాగూన్ చిత్రంలో నటించినప్పుడు తన వయసు 13 సంవత్సరాలని, అప్పటినుంచి జాక్సన్, తను మంచి స్నేహితులుగా మెలిగామని ఆమె తెలిపినట్లు పత్రిక పేర్కొంది.