పాప్ సంగీత సామ్రాజ్యంలో మైఖేల్ జాక్సన్ ఓ గొప్ప కళాఖండమని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా జాక్సన్‌ను కొనియాడారు. అతను ఒక అత్యద్భుతమైన సంగీత వారసత్వ సంపదను మనకు వదిలి వెళ్లారని ఆయన నివాళులర్పించారు.
అమెరికా ప్రజలనే కాక యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మహోన్నతమైన కళాకారులలో జాక్సన్ ఒకరని ఒబామా ప్రస్తుతించారు. మన తరంలో అపారంగా ప్రజల్ని ఆకర్షించిన అద్భుతమైన కళాకారులలో ఈయన ఒకరని ఆయన కొనియాడారు.
మన తరంలోనే కాదు, బహుశా ఇకపై ముందు తరాలలో ఇలాంటి గొప్ప ప్రజాకర్షణ కలిగిన కళాకారుడు పుట్టకపోవచ్చని ఒబామా సిఎన్ఎన్కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ సందర్భంగా మైఖేల్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.