లాస్ ఏంజెలెస్‌లో మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో జాక్సన్ అంత్యక్రియలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆయన అంత్యక్రియల్లో ప్రముఖ కళాకారులు స్టీవ్ వాండెర్, డయానా రాస్, జస్టిన్ టింబెర్లేక్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా వీరు ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇస్తారు.

జాక్సన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన అంత్యక్రియలు భూమిమీద ఇంతకుముందెన్నడూ జరగని రీతిలో జరగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం జాక్సన్ అంత్యక్రియలు ఆయన కోరికను తీర్చే విధంగా ప్రముఖ స్టార్ల ప్రదర్శనలతో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయని సన్ ఆన్‌లైన్ పేర్కొంది.

జాక్సన్ అంత్యక్రియల్లో పాటలు పాడాలని నిర్వాహకులు రాస్, వాండర్‌లను సంప్రదించారు. జాక్సన్ 1992 హిట్ "హీల్ ది వరల్డ్" ఆల్బమ్‌ను తిరిగి పాడించేందుకు నిర్వాహకులు ప్రముఖ కళాకారుల సాయం కోరారు. మైఖేల్ అంత్యక్రియలను సగర్వంగా జరపాలనుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి