విమానాల పేల్చివేత కుట్ర: పాక్‌కు సంబంధాలు

లండన్‌లోని హిత్రూ విమానాశ్రయం నుంచి అమెరికా, కెనడా దేశాలకు వెళ్లే ఏడు విమానాలను లిక్విడ్ బాంబులతో పేల్చివేయడం ద్వారా భారీ మారణహోమం సృష్టించేందుకు మూడేళ్ల క్రితం జరిగిన కుట్రలో పాకిస్థాన్‌కు కూడా సంబంధాలు ఉన్నట్లు బ్రిటన్ అధికారిక యంత్రాంగం వెల్లడించింది. పాకిస్థాన్‌లోనే ఈ ఆత్మాహుతి దాడులకు కుట్ర జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ కుట్రను భగ్నం చేసిన బ్రిటన్ యాంత్రాంగం ఈ కేసును లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేసింది. అసాధారణ రీతిలో సాగిన దర్యాప్తులో బ్రిటన్ పోలీసులు కొనుగొన్న సమాచారం మంగళవారం వెల్లడైంది. సెప్టెంబరు 11, 2001 దాడులకు మించి మారణహోమాన్ని సృష్టించడం విమానాల పేల్చివేత ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించిన కేసులో బ్రిటన్ కోర్టు సోమవారం ముగ్గురిని దోషులుగా పరిగణించిన సంగతి తెలిసిందే.

లండన్‌కు చెందిన పౌరులే ఈ ఆత్మాహుతి దాడుల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ లండన్ ముఠా సభ్యులకు పాకిస్థాన్‌లోని అల్ ఖైదా నేతలతో సంబంధాలు ఉన్నాయని, వీరు తరుచుగా పాక్ తీవ్రవాద నేతలతో సంప్రదింపులు జరిపేవారని బ్రిటన్ పోలీసులు వెల్లడించారు. అల్ ఖైదా ప్రమేయంపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ దాడులకు పాకిస్థాన్‌లోనే వ్యూహరచన జరిగిందన్నారు.

వెబ్దునియా పై చదవండి