అక్కడ అడుగు పెడితే గుండెపోటు ఖాయమట...

శుక్రవారం, 29 జులై 2016 (15:28 IST)
అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా, చంద్ర మండలం మానవునికి నివాస కేంద్రంగా ఉపయోగపడుతుందా లేదా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఈ పరిశోధకులను ఓ అంశం కలవరపెడుతోంది. అందేంటంటే... చంద్రమండలంపై అడుగుపెట్టిన వారికి హార్ట్ ఎటాక్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు గతంలో అనేక సంఘటనలు సైతం వారు ఉదహరిస్తున్నారు. 
 
చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సైతం 2012లో హార్ట్ ఎటాక్తోనే మరణించారు. ఆ తర్వాత అపోలో యాత్ర చేపట్టిన జేమ్స్ ఇర్విన్ అనే అంతరిక్ష యాత్రికుడు చంద్రుడిపై అడుగుపెట్టిన రెండేళ్ళ తర్వాత గుండెపోటు బారిన పడి చనిపోయాడు. 
 
అలాగే, ఈయన సహచరుడు రాన్ ఇవాన్స్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇర్విన్ 61 యేళ్ల వయసులో గుండెపోటుతో మరణించగా, ఇవాన్స్ 56 యేళ్ళ వయసులో చనిపోయారు. అయితే, నాసా శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి