జంట పేలుళ్లతో దద్ధరిల్లిన ఇరాక్‌: ఐఎస్ పనే.. 23 మంది మృతి

ఆదివారం, 1 మే 2016 (18:48 IST)
ఇరాక్‌ జంట పేలుళ్లతో దద్ధరిల్లింది. ఆదివారం ఇరాక్ నగరంలో చోటుచేసుకున్న పేలుళ్ల కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతాధికారులు తెలిపారు. ఈ పేలుళ్లకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. 
 
ఇరాక్ నగరంలో తొలి పేలుడు సమోవా నగరంలోని ప్రభుత్వ కార్యాలయం వద్ద, రెండో పేలుడు కొద్ది దూరంలోని బస్టాండ్ వద్ద సంభవించింది. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఐఎస్‌కు వ్యతిరేకంగా ఇరాక్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఈ పేలుళ్లకు కారణమని తెలుస్తోంది. పేలుళ్ల నేపథ్యంలో ఇరాక్‌లోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి