ఆ పాపకు నాలుక పెరిగిపోయింది.. వైద్యుల అరుదైన చికిత్స.. అమ్మా అని పిలిచిన చిన్నారి..?

మంగళవారం, 21 జూన్ 2016 (10:03 IST)
అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన 14 నెలల చిన్నారి రోరీ గాడ్‌ఫ్రే కనివినీ ఎరుగని వింత వ్యాధితో, సతమతమవుతోంది. అదేంటంటే... పుట్టిన దగ్గరుండి పాపకు పరిమాణానికి మించి నాలుక పెరిగిపోయే అరుదైన వ్యాధి సోకింది. బెక్‌విత్‌ - వీడెమన్‌ సిండ్రోమ్‌గా పిలిచే ఈ జబ్బు ప్రపంచంలో 15 వేల మంది పిల్లల్లో ఒకరికి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. 
 
ఈ చిన్నారికి ఇలా నాలుక పరిమాణం పెరిగిపోవడంతో తినాలన్నా, తాగాలన్నా నానా తంటాలు పడుతున్నాడు. ఈ సమస్యతోనే సతమతమవుతుంటే శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురై రోజుకు దాదాపు 100సార్లు ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. రెండు నెలల కిందట ఈ చిన్నారికి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేసి పెరిగిన నాలుకను తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి మొదటిసారి అమ్మాని పిలిచి చిలకపలుకులు పలకడంతో తల్లిదండ్రులు ఆనంద సాగరంలో తేలిపోయారు. తమ బిడ్డని ఇబ్బందులనుండి తొలగించినందుకు వైద్యులకు ధన్యవాదాలు  తెలిపారు.

వెబ్దునియా పై చదవండి