చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు సోకింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనాతో లాక్ డౌన్‌లో ప్రపంచ దేశాలు వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా రిపోర్ట్ ప్రజలను హడలెత్తేలా చేసింది. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనే వాదన ప్రస్తుతం బలపడుతోంది.
ఫిబ్రవరి, మార్చినెలల్లో ఈ నమూనాలు తీసుకున్నారు. ఆస్పత్రి ప్రాంతంలోని గాలితో పాటు నివాస సముదాయం, సూపర్ మార్కెట్, డిపార్ట్ మెంట్ స్టోర్ల నుంచి కూడా గాలి నమూనాలు తీసుకున్నారు. విశ్లేషణ తర్వాత ఆస్పత్రుల గాలి నమూనాల్లో కరోనా వైరస్ వున్నట్లు తెలిసింది.
మిగిలిన ప్రదేశాల్లో తీసుకున్న ప్రదేశాలు సురక్షితంగా వున్నట్లు గుర్తించారు. ఆస్పత్రుల్లో గుంపుగా వుండే ప్రాంతాలు, ఐసోలేషన్ వార్డులు, కరోనా బాధితుల గదులు, గాలి సోకని టాయ్‌లెట్లు గాలిలో అత్యల్పస్థాయిలోనే వైరస్ వున్నట్లు గుర్తించారు. కానీ మనుషులకు ఎంతవరకు హాని చేస్తాయనేది ఇంకా తెలియరాలేదు.