సైన్యంలో పనిచేసేందుకు హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనీ చేశారు. దేశీయ మిలటరీలో హిజ్రాలు చేరకుండా నిషేధం విధిస్తూ సంతకం చేశారు.
హిజ్రాల నియామకాలను నిషేధిస్తామంటూ గతంలోనే ట్రంప్ ప్రకటించారు. దీంతో, అమెరికా వ్యాప్తంగా ట్రంప్ నిర్ణయంపై హిజ్రాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ తన నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. ఫలితంగా రక్షణ సేవల్లో హిజ్రాల సేవలు, వారి నియామకాలు రద్దు కాబోతున్నాయి.